Site icon HashtagU Telugu

Sri Lanka economic crisis : శ్రీలంకలో అదుపుతప్పిన పరిస్థితులు…ప్రధాని నివాసానికి నిప్పు..!!

Sri Lanka economic crisis

Sri Lanka economic crisis

శ్రీలంకలో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. రాజధాని కొలంబోలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. మొదట దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సే నివాసాన్ని ముట్టడించిన ఆందోళనకారులు…ఆ తర్వాత ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రైవేట్ నివాసానికి నిప్పంటించారు. గేట్లు విరగొట్టి లోపలికి ప్రవేశించారు. విధ్వంసం సృష్టించారు. ప్రధానికి చెందిన వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. వేలాది మంది ఒక్కసారిగా వచ్చిపడటంతో పోలీసులు నిస్సహాయులుగా మారారు.

దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సే నివాసాన్ని ఆందోళనకారులు మట్టడించినప్పుడే ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రమాదాన్ని పసిగట్టి ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అఖలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని రణిల్ ప్రకటన చేశారు.

కానీ తమ దుస్థితికి ప్రభుత్వమే కారణమంటూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు విక్రమసింఘే కార్యాలయం నుంచి వెలువడిని ఆ ప్రకటనను పట్టించుకోలేదు. విక్రమసింఘే ప్రైవేట్ నివాసాన్ని ముట్టడించారు.