Pemmasani Chandrasekhar: గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌కు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం గంగరాజు నోటీసు పంపారు. మార్చి 25న నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో పెమ్మసాని వైఎస్సార్‌సీపీ నేతలను సద్దాం హుస్సేన్‌తో పోల్చారు.
We’re now on WhatsApp : Click to Join
‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు సద్దాం హుస్సేన్‌లా ప్రవర్తిస్తున్నారు. సద్దాం హుస్సేన్ కూడా నిరంకుశంగా ప్రవర్తించాడు. అందుకే అతనిని బయటకు లాగి కుక్కలా నిర్దాక్షిణ్యంగా చంపారు, అని పెమ్మసాని అన్నారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఈసీకి ఫిర్యాదు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ నాగుల్‌మీరా తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
Also Read: Throat Pain: గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి?