Site icon HashtagU Telugu

Election Commision: ఈవీఎంల గోల్​మాల్ పై స్పందించించిన ఈసీ!

Election Commission To Congress

Election Commission To Congress

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. కాంగ్రెస్‌ పార్టీ అనుమానాలను నివృత్తి చేసేందుకు డిసెంబర్ 3న తమ ప్రతినిధులు ఈసీ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆహ్వానించింది.

‘‘ఎన్నికలు ప్రతి దశలోనూ పారదర్శకంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించిన చట్టపరమైన ఆందోళనలను మేము పరిశీలిస్తాం. ఆ తరువాత, వారి అనుమానాలకు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తాము’’ అని ఎన్నికల సంఘం హస్తం పార్టీ ప్రతినిధుల బృందాన్ని ఆహ్వానించింది.

శుక్రవారం మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని తెలిపిన కాంగ్రెస్, ఈసీకి లేఖ రాశి, తమ అనుమానాలను వ్యక్తిగతంగా తెలియజేస్తాం అని కోరింది. దీనిపై ఈసీ స్పందిస్తూ డిసెంబర్ 3 న వచ్చి మీ అనుమానాలను తెలియజేయండి అని చెప్పింది.

ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి ఘన విజయాన్ని సాధించింది. భాజపా 132 సీట్లు సాధించగా, షిండే శివసేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీకి 41 సీట్లు లభించాయి.

మరో వైపు, విపక్షం అయిన మహావికాస్ అఘాడీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 16 సీట్లు మాత్రమే దక్కగా, శివసేన (యూబీటీ) 20 సీట్లు, ఎన్‌సీపీ (ఎస్‌పీ) 10 సీట్లు గెలుచుకుంది.

ఈ ఫలితాలతో మహాయుతి కూటమి రాష్ట్రంలో తమ ప్రభవాన్ని దృఢీకరించుకుంది, కాగా మహావికాస్ అఘాడీ పార్టీలు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.