Site icon HashtagU Telugu

AP Voter Registration: ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు ప్రక్రియకు ఈసీ ఆదేశం..!

Election Commission

Election Commission

ఏపీలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 2023 మార్చి 29 తేదీన ఆరు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుండటంతో ఓటర్ల నమోదు ప్రక్రియ షెడ్యూల్ ప్రకటన విడుదలైంది. 2022 అక్టోబర్‌ 1 తేదీ నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు బహిరంగ ప్రకటన జారీ చేయాలని ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ అయ్యాయి. 2022 నవంబర్‌ 7 తేదీ నుంచి ఫామ్‌- 18 ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని సూచనలు చేశారు.

ఈ ఏడాది నవంబర్‌ 23 తేదీ నాటికి ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించాలని స్పష్టం చేసింది. డిసెంబర్ 23 తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా రూపొందించాలని ఆదేశించింది. 2023 మార్చి 29వ‌ తేదీ నాటికి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులు, టీచర్ల ఓటర్ల నమోదు ప్రక్రియపై అధికారులు దృష్టి సారించ‌నున్నారు.