Earthquake: లడఖ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు..!

మంగళవారం తెల్లవారుజామున లడఖ్‌లో భూమి కంపించింది. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఉదయం 4:33 గంటలకు భూకంపం (Earthquake) సంభవించింది.

  • Written By:
  • Updated On - December 26, 2023 / 09:05 AM IST

Earthquake: మంగళవారం తెల్లవారుజామున లడఖ్‌, లెహ్ లో భూమి కంపించింది. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఉదయం 4:33 గంటలకు భూకంపం (Earthquake) సంభవించింది. దీని కేంద్రం ఉపరితలం నుండి 5 కిలోమీటర్ల దిగువన ఉంది. మంగళవారం (26 డిసెంబర్ 2023) తెల్లవారుజామున 4:30 గంటలకు లడఖ్‌లో సంభవించిన భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. ప్రకంపనలు 34.73 అక్షాంశం, 77.07 రేఖాంశంలో సంభవించాయి. తెల్లవారుజామున బలమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు నిద్ర నుంచి లేపారు. చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. లడఖ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లో కూడా భూకంపం సంభవించింది.

మంగళవారం జమ్మూలో కూడా భూకంపం సంభవించడం గమనార్హం. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. NCS ప్రకారం.. భూకంపం తెల్లవారుజామున 1.10 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో సంభవించింది.

Also Read: Indian Plane : ఫ్రాన్స్ చెర నుంచి విముక్తి.. ఆ విమానాన్ని ఎందుకు ఆపారంటే..

భూకంపాలు ఎందుకు వస్తాయి..?

భూమి లోపల అకస్మిక కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపం అనేది భూమి క్రస్ట్‌లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్ట్రెయిన్ ఎనర్జీ. దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్ లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. రాతి పొర వాటిని పైకి రానీయకుండా చేస్తుంది. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు.. బలహీన ప్రాంతాాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది. భూకంపాలు రావడానికి మానవ తప్పిదాలు కూడా ఒక కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం, భూగర్భ జలాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయడం. అడవుల్లో చెట్లను నరికివేయడం వంటి వాటి వల్ల కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది.

We’re now on WhatsApp. Click to Join.