Site icon HashtagU Telugu

Earthquake: అక్కడ మరోసారి భూకంపం… 6.4 తీవ్రత నమోదు.. వణికిపోయిన జనం!

Earthquake Again Turkey Inner

Earthquake Again Turkey Inner

Earthquake: ఇప్పటికే భారీ భూకంపంతో అతలాకుతలమైన టర్కీ-సిరియా దేశాలను ఆ తర్వాత కూడా భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. మరోసారి టర్కీ-సిరియా దేశాల మధ్య భారీ భూకంపం సంభవించింది. టర్కీ-సిరియా సరిహద్దు ప్రాంతంలో రెండు కిలోమీటర్ల లోతులో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది ఈ మేరకు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్కోలాజికల్ సెంటర్ వెల్లడించింది. తాజా భూకంపంతో మరోసారి ఈ రెండు దేశాల ప్రజలు భయంతో వణికిపోయారు.

టర్కీ, సిరియా బోర్డర్‌లోని దక్షిణ హటే ప్రావిన్స్‌లో 6.4 తీవ్రతతో మరోసారి రెండు భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఈ భూకంపం కారణంగా ముగ్గురు మృతి చెందాగా, 213 మంది గాయపడ్డారని ఆ దేశ మంత్రి సులేమాన్ సోయ్లు తెలిపారు. మూడు ప్రదేశాల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని వెల్లడించారు.

సోమవారం రాత్రి 8.04 గంటలకు డెఫ్నే నగరంలో భూకంపం సంభవించింది. ఉత్తరాన 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంటక్యా,అదానా నగరాల్లో బలంగా కంపించింది. ఇది జరిగిన వెంటనే, హతాయ్‌లోని సమందాగ్ జిల్లాలోనూ మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. అల్ జజీరా నివేదిక ప్రకారం ఈ ప్రాంతంలో భవనాలు దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి. దెబ్బతిన్న భవనాలు ఉన్నాయి.

తాజాగా టర్కీలో సంభవించిన భూకంపం అతలాకుతలమైన తరుణంలో ఈ భూకంపం వచ్చింది. ఫిబ్రవరి 6న టర్కీలో సంభవించిన వినాశకరమైన భూకంపం శిథిలాలలో ఉన్న వ్యక్తుల కోసం అన్వేషణ, రెస్క్యూ ఆపరేషన్ ముగింపు దిశగా సాగడం ప్రారంభించింది. భూకంప ప్రభావిత 11 ప్రావిన్సుల్లో తొమ్మిది ప్రావిన్సుల్లో సహాయక చర్యలు ముగిశాయి. అదే సమయంలో టర్కీలో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 40,689 కు పెరిగింది. ప్రస్తుతం కూల్చివేత బృందం శిథిలాల కుప్పను తొలగించే పనిలో నిమగ్నమై ఉంది.