Earthquake: ఇండోనేషియాలో 6.0 తీవ్రతతో భూకంపం.. సునామీ ముప్పు లేదు..!

సెంట్రల్ ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లో శుక్రవారం సాయంత్రం 6.0 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది.

  • Written By:
  • Publish Date - August 5, 2023 / 06:27 AM IST

Earthquake: సెంట్రల్ ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లో శుక్రవారం సాయంత్రం 6.0 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. అయితే సంబంధిత అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. దేశ వాతావరణ శాఖ, జియోఫిజిక్స్ ఏజెన్సీ ఈ సమాచారాన్ని అందించింది. శుక్రవారం సాయంత్రం 6.48 గంటలకు భూకంపం సంభవించినట్లు జియోఫిజిక్స్ ఏజెన్సీని ఉటంకిస్తూ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. దీని కేంద్రం బోలాంగ్ మోంగ్డో తైమూర్ (తూర్పు బోలాంగ్ మోంగ్డో) జిల్లాకు ఆగ్నేయంగా 117 కి.మీ దూరంలో, సముద్ర మట్టానికి 10 కి.మీ లోతులో ఉంది. భూకంపం భారీ అలలను సృష్టించే అవకాశం లేదని ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ భూకంపం వలన ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

భూకంపాలు ఎందుకు వస్తాయి..?

ప్రతి ఏడాది భూకంపాలు ఎందుకు వస్తాయి..? దీనికి కారణం ఏమిటి..? భూకంపం కలిగించే కదలికలు ఎలా ఏర్పడతాయి..? ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 వేలకు పైగా భూకంప ప్రకంపనలు నమోదవుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. భూమి లోపల అకస్మిక కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపం అనేది భూమి క్రస్ట్‌లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్ట్రెయిన్ ఎనర్జీ (ఒత్తిడి శక్తి). దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి.

Also Read: Slackline Athlete Rope Walk : రెండు ఎత్తయిన టవర్ల మధ్య కట్టిన తాడుపై నడుస్తూ రికార్డు..

క్రస్ట్ లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. రాతి పొర వాటిని పైకి రానీయకుండా చేస్తుంది. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు బలహీన ప్రాంతాాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది. భూకంపాలు రావడానికి మానవ తప్పిదాలు కూడా ఒక కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం, భూగర్భ జలాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయడం, అడవుల్లో చెట్లను నరికివేయడం వంటి వాటి వల్ల కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది.