Earthquake: భూకంపానికి గ్రామం రెండుగా చీలిక… ప్రజల జీవనం ఎలా?

టర్కీ, తుర్కియేలో సంభవించిన భూకంపం అక్కడి జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వేల మంది ప్రాణాలను తీసుకోగా..

  • Written By:
  • Updated On - February 19, 2023 / 09:50 PM IST

Earthquake: టర్కీ, తుర్కియేలో సంభవించిన భూకంపం అక్కడి జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వేల మంది ప్రాణాలను తీసుకోగా.. అనేక మందిని నిరాశ్రయిలుగా మార్చింది. ఇక కోట్లల్లోనే ఆస్తి నష్టం జరిగింది. మూగ జీవాల పరిస్థితి వర్ణనాతీతం. ఇప్పటికీ సహాయ చర్యలు జరుగుతూనే ఉన్నాయి. శవాలు బయటపడుతున్నాయి. భూకంప ధాటికి అక్క డ ఓ గ్రామం రెండుగా చీలిపోయింది. దీన్నిబట్టి.. ఆ ప్రలయం ఎంతటి విపత్తును సృష్టించిందో తెలుస్తోంది.

తుర్కియేలో భూకంపం సృష్టించిన విలయం వేల కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. వీటితోపాటు వేల కొద్ది భవనాలు నేలమట్టం అయ్యాయి. దీంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వారి పరిస్థితి అగ్యమ్య గోచరంగా ఉంది. చాలా ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమై ఎక్కడ చూసినా శిథిలాల కుప్పలుగా మారిపోయాయి. పాక్షికంగా కూలిపోయిన ఇళ్లు కొన్నైతే… పూర్తిగా నెలమట్టం అయినవి మరికొన్ని. పూర్తిగా కూలిపోయిన ఇళ్లల్లోకి వెళ్లలేక… ప్రభుత్వం కల్పించిన వసతి గృహాల్లోనే ఇప్పటికే వేల మంది తలదాచుకున్నారు.

అయితే తుర్కియేలోని దెమిర్కొప్రు అనే గ్రామం భూకంప తీవ్రతకు రెండుగా చీలిపోయింది. అనేక ఇళ్లు ధ్వంసమైన ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే, అక్కడ ప్రాణనష్టం మాత్రం జరగకపోవడం ఊరట కలిగిస్తోంది. దెమిర్కొప్రు అనే గ్రామంలో వెయ్యి మంది జనాభా నివాసం ఉంటోంది. ఫిబ్రవరి 6 రోజున సంభవించిన భూప్రకంపంతో అక్కడి వారంతా ఉలిక్కి పడ్డారు. భయాందోళనలకు గురైన స్థానికులు బయటకు వచ్చి పరుగులు తీశారు.

భూకంప తీవ్రత అధికంగా ఉండడంతోపాటు ఇళ్ల మధ్య నుంచి చీలిక వచ్చింది. పలు చోట్ల భూభాగం కొన్ని మీటర్లలోతుకు కుంగిపోయింది. దీంతో చాలా ఇళ్లు అందులో కుంగిపోయాయి. భారీగా ఆస్తినష్టం సంభవించినప్పటికీ.. అదృష్టవశాత్తు ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదు.
కొందరు మాత్రం గాయాలతో బయటపడ్డారు. దెమిర్కొప్రుకు సుమారు 20 కి.మీ దూరంలో ఉన్న ఆంటక్యా గ్రామం ఉంది.

చారిత్రక నగరమైన ఈ ప్రాంతంలోనూ భూకంపం ప్రభావం అధికం గా ఉంది. ప్రకంపనల ధాటికి అక్క డి ఇళ్లు, రోడ్లు పూర్తిగా
ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో భూమిలో నుంచి నీరు పొంగుకు వచ్చిందని స్థానికులు తెలిపారు. అయితే ఇందుకు సంబం ధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.