Russia Earthquake: రష్యా తూర్పు తీరంలో గల కురిల్ దీవుల్లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు భారీగా కుదుపులు వచ్చాయి. యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ భూకంపం భూమికి సుమారు 12 కిలోమీటర్ల లోతులో నమోదైందని EMSC తెలిపింది. ఇది సుమారు 7.46 మైళ్ళ లోతు కాగా, ఇలాంటి లోతులో సంభవించే భూకంపాలు సాధారణంగా భూమిపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ప్రకంపనలు సమీప ప్రాంతాలపై ఎంతమేర ప్రభావం చూపాయన్నదానిపై ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
కురిల్ దీవులు భూకంపాలకు అత్యంత ప్రభావితంగా ఉండే “పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలోనే ఉన్న కారణంగా ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే ఈసారి సంభవించిన ప్రకంపనల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందా అన్న దానిపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. ప్రాంతంలో నివసించే ప్రజలు ప్రకంపనలు తీవ్రంగా అనుభవించినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. కొంతమంది భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారని సమాచారం. అయితే అధికారికంగా ప్రజల సురక్షిత పరిస్థితిపై స్పష్టత రాలేదు. స్థానిక ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది.
Team India Head Coach: స్వదేశానికి గౌతమ్ గంభీర్.. టీమిండియాకు తాత్కాలిక హెడ్ కోచ్ ఎవరంటే?
భూకంపం తీవ్రతను బట్టి ఇది ప్రాథమిక ప్రకంపన (mainshock) అయి ఉండవచ్చని, దీని తర్వాత తక్కువ తీవ్రత కలిగిన అనుబంధ ప్రకంపనలు (aftershocks) సంభవించే అవకాశముందని సీస్మోలాజిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక విపత్తు నివారణ విభాగం సూచించింది. ఈ భూకంపానికి సంబంధించిన మరిన్ని వివరాలు – కేంద్రబిందువు ఖచ్చితమైన స్థానం, ప్రభావిత పట్టణాలు, సునామీ హెచ్చరికలు వంటి అంశాలపై ఇంకా సమాచారం వెలువడాల్సి ఉంది. సంబంధిత అధికార సంస్థలు పరిశీలనలు కొనసాగిస్తున్నాయి.