Site icon HashtagU Telugu

Earthquake: నేపాల్‌ రాజధానిలో భారీ భూకంపం..!

Philippines

Earthquake 1 1120576 1655962963

నేపాల్‌ రాజధాని ఖాట్మండులో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదు అయింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం.. ఖాట్మండుకు తూర్పున 53 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2.52 గంటలకు కొండ ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో నమోదు అయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

ఈ భూకంపంవల్ల ఖాట్మండులోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే ఈ భూకంపంలో ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ సంభవించలేదు. భూకంపం సంభవించిన వెంటనే పాట్నాతో సహా బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని భారత వాతావరణ విభాగం (IMD) పాట్నా యూనిట్ తెలిపింది.