Site icon HashtagU Telugu

Earthquake: అండమాన్‌లో భూకంపం.. రిక్టర్‌స్కేలుపై 4.3గా నమోదు

Earthquake

Earthquake

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో గురువారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం వచ్చింది. పోర్ట్‌బ్లేయిర్‌లో 2.29 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.


బుధవారం తెల్లవారుజామున నేపాల్‌తోపాటు ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. నేపాల్‌లో 6.6 తీవ్రతతో భూ కంపం వచ్చింది. దీంతో దోతి జిల్లాలో ఇండ్లు కూలడంతో ఆరుగురు మరణించారు. ఇక ఉత్తరాఖండ్‌లో బుధవారం ఉదయం 6.30 గంటలకు 4.3 తీవ్రతతో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ, రాజధాని ప్రాంతంతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించిన విషయం విధితమే.