పలు దేశాల్లో భూకంపం (Earthquake) భయాందోళనలు రేపుతోంది. ఇప్పటికే టర్కీ, సిరియా కంట్రీస్ ను అతలాకుతలం చేయగా, తాజాగా మరో దేశంలో భూకంపం సంభవించింది. న్యూజిలాండ్ (New Zealand) లో సోమవారం ఉదయం భూకంపం వచ్చింది. 09:18:07 GMT సమయంలో న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవులలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ఈ సమాచారాన్ని వెల్లడించింది. భూకంప కేంద్రాన్ని 29.5218 డిగ్రీల దక్షిణ అక్షాంశం, 177.9727 డిగ్రీల పశ్చిమ రేఖాంశంలో 374.033 కి.మీ లోతుతో ప్రాథమికంగా నిర్ణయించారు. భూకంపం (Earthquake) కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Earthquake in New Zealand: న్యూజిలాండ్‌లో భూకంపం.. 6.1 తీవ్రత నమోదు!

Earthquake 1 1120576 1655962963