Earthquake : భూకంపంతో వణుకు.. కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో అలర్ట్

Earthquake : జమ్మూకాశ్మీర్‌లోని దోడా జిల్లాలో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చింది..

Published By: HashtagU Telugu Desk
Chile Earthquake

Chile Earthquake

Earthquake : జమ్మూకాశ్మీర్‌లోని దోడా జిల్లాలో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చింది.. 

ఈవిషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.

ఈరోజు ఉదయం 5.38 గంటలకు భూకంపం సంభవించిందని వెల్లడించింది. 

Also read : 900 Crores To Girl Friend : గర్ల్ ఫ్రెండ్ కు 900 కోట్ల ఆస్తిని రాసిచ్చిన లీడర్

అయితే భూకంపం వల్ల (Earthquake) ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటికైతే సమాచారం లేదని అధికారులు తెలిపారు.

భూకంప కేంద్రం దోడా ప్రాంతంలో భూమికి 10 కి.మీ దిగువన ఉందన్నారు. ఈ సంవత్సరం జూన్ నుంచి వివిధ తీవ్రతలతో 12సార్లు భూప్రకంపనలు దోడాను కుదిపేశాయి.

గత నెల (జూన్) 13న దోడా  జిల్లావ్యాప్తంగా 5.4 తీవ్రతతో భూకంపం సంభవించడంతో డజన్ల కొద్దీ భవనాలు బీటలు వారాయి.

  Last Updated: 10 Jul 2023, 11:00 AM IST