Site icon HashtagU Telugu

Earthquake:: నార్త్ ఆఫ్రికన్ కంట్రీ మొరాకోలో భారీ భూకంపం

Earthquake

New Web Story Copy 2023 09 09t145137.226

Earthquake: నార్త్ ఆఫ్రికన్ కంట్రీ మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ మొరాకోలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైంది. ఈ ప్రమాదంలో 632 మంది మరణించినట్లు, మరో 153 మంది గాయపడ్డారని పేర్కొంది. మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక ఈ ఘటనలో దాదాపు 51 మంది క్రిటికల్‌గా ఉన్నట్లు అక్కడి మీడియా తెలిపింది.

భూకంప కేంద్రం మర్రకేష్‌కు నైరుతి దిశలో 71 కి.మీ దూరంలో ఉన్న హై అట్లాస్ పర్వతాలలో 18.5 కి.మీ లోతులో ఉన్నట్లు ప్రముఖ మీడియా నివేదించింది. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దెబ్బతిన్న రోడ్లు, కూలిన భవనాలు, శిథిలాలతో నిండిన వీధులు చూస్తుంటే అక్కడి పరిస్థితి ఏంటో అర్ధమవుతుంది. భారీ భూకంపం సంభవించడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ మేరకు పోలీసులు, ఫైర్ ఇంజన్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Kodali Nani: బొచ్చు లెస్.. బ్రెయిన్ లెస్.. బాలకృష్ణ ఇప్పుడైనా బ్రెయిన్ వాడాలి: కొడాలి నాని