మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas), మాధురి (Madhuri) జంటగా వచ్చి తిరుమల శ్రీవారి(Tirumala Srivari)ని దర్శించుకున్నారు. గత కొద్దీ నెలలుగా దువ్వాడ ఇంట్లో వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. మాధురి మోజులో పడి తమకు అన్యాయం చేశాడంటూ భార్య , పిల్లలు రోడ్డెక్కారు. ఆఖరికి ఇంటిని సైతం మధురైకి రాసిచ్చి..తమకు ఏమిలేకుండా చేసాడని వారంతా వాపుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం శ్రీవారిని జంటగా వచ్చి మరోసారి వార్తలో నిలిచారు శ్రీనివాస్ అండ్ మాధురి. బ్రహ్మోత్సవాలను తనివీతీరా చూసేందుకు తిరుమలకు వచ్చామని , శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నామని , ప్రజలందరికి శాంతిసౌకర్యాలు చేకూర్చాలని శ్రీనివారిని కోరుకున్నట్లు శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. తన సతీమణి వాణితో కాకుండా మాధురితో కలసి రావడంతో తిరుమలలో చూసిన భక్తులు దీనిపై చర్చించుకుంటున్నారు.
Read Also : Dasara Weekend : ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న మూవీస్, వెబ్ సిరీస్‌లు ఇవే