Kodali: జగన్ హయాంలో 850 కోట్లతో టీడ్కో ఇళ్లు పూర్తి చేశాం: కొడాలి నాని

  • Written By:
  • Publish Date - April 22, 2024 / 11:37 PM IST

Kodali: గుడివాడకు  చెందిన 100 మంది యువకులు, పలువురు టిడిపి నాయకులు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు. యువతకు పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీలోకి ఆహ్వానించారు. చేరికల అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో కులమత పార్టీలు చూడకుండా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందజేసి వారి సొంతింటి కలను నిజం చేసేందుకు సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఒక గుడివాడలోని 8వేల,812 మందికి టీడ్కో ఇల్లు, 182 ఎకరాలు సేకరించి 7వేల మందికిల ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు.

ఇప్పటికే జగనన్న లేఅవుట్లో 4వేల మంది తమ ఇళ్ళను నిర్మించుకున్నారన్నారు. ఎంతో గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు గుడివాడ పట్టణంలో లబ్ధిదారుల వద్ద నుండి 60 కోట్లు వసూలు చేసి, 3వేల టీడ్కో ఇల్లు నిర్మాణం మొదలుపెట్టి 12వందల ఇళ్లను కేవలం 25% మాత్రమే పూర్తి పూర్తి చేసి కాంట్రాక్టర్ కు 45 కోట్లు మాత్రమే చెల్లించాడని ఎమ్మెల్యే కొడాలి నాని తెలియజేశారు. చంద్రబాబు లబ్ధిదారుల దగ్గర వసూలు చేసిన డబ్బునే పక్కదారి పట్టించాడని…. సీఎం జగన్ హయాంలో 850 కోట్ల సొమ్ముతో టీడ్కో ఇల్ల నిర్మాణాన్ని పూర్తి చేసామని ఎమ్మెల్యే నాని అన్నారు.

లబ్ధిదారులు లోన్ నగదు కట్టకుండా ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారని ఎమ్మెల్యే నాని సభ ముఖంగా తెలియజేశారు.గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన గృహ రుణాలను జగన్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి వారిని రుణ విముక్తుల్ని చేసిందని ఎమ్మెల్యే నాని తెలియజేశారు.ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్నిచోట్ల మౌలిక వసతులు కల్పించడంలో ఇబ్బందులు తలెత్తయని ఆయన అన్నారు.