Drugs : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న క‌స్ట‌మ్స్ అధికారులు

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ్డాయి. కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ 216.69 కిలోల

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 11:18 PM IST

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ్డాయి. కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ 216.69 కిలోల మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకుంది, వాటి విలువ రూ..468.02 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. వీటిని తెలంగాణలోని మేడ్చల్ జిల్లా, దుండిగల్ గ్రామంలోని హైదరాబాద్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్‌లో మత్తుమందులు, సైకోట్రోపిక్ పదార్థాలను ద్వంసం చేశారు. డ్రగ్స్‌లో 27.91 కిలోల హెరాయిన్, 136.28 కిలోల మెఫెడ్రోన్, 52.5 కిలోల గంజాయి ఉన్నాయి. అదనంగా రూ.40 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను కూడా ఉన్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) మరియు RGI విమానాశ్రయంలోని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు నైజీరియన్లు, టాంజానియన్లు, దక్షిణాఫ్రికా, బెనినీస్, భారతీయులతో సహా వివిధ దేశాల నుండి వచ్చిన వ్యక్తుల నుండి ఈ పదార్ధాలను పట్టుకున్నారు.