Site icon HashtagU Telugu

Vijayawada : దుర్గ‌గుడిలో భ‌క్తురాలి ఉంగ‌రం కోట్టేసిన ఉద్యోగి

Durga Temple

Durga Temple

విజ‌య‌వాడ దుర్గగుడిలో భ‌క్తురాలి బంగారం చోరీ జ‌రిగింది. ఉయ్యూరు నుంచి దుర్గ గుడి కి వచ్చిన ఓ భక్తురాలు కొబ్బరికాయ కొట్టే స‌మ‌యంలో ఆమె ఉంగ‌రం కింద ప‌డిపోయింది. అయితే దానిని గమనించిన కాంట్రాక్టు ఉద్యోగి ఉంగరం తీసి తన జోబులో వేసుకున్నాడు. ఉంగరం పడిపోయిన విషయాన్ని బాధితురాలు గమనించి అక్కడ ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి అడగగా మాకు ఏమీ తెలియదు అంటూ బుకాయించాడు. దీంతో చేసేదేమీ లేక దుర్గ‌గుడి అవుట్ పోస్ట్ లో ఉన్న పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు కొబ్బ‌రికాయ‌లు కొట్టే ఆవ‌ర‌ణ‌లోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు కాంట్రాక్టు ఉద్యోగి ఉంగరాన్ని జోబులో వేసుకున్నట్లుగా చూసి అదుపులోనికి తీసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లకు తరలించారు.