దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, లడ్డూప్రసాదం, తలనీలాలు కలిపి పదిరోజులకు రూ.6.34 కోట్లు ఆదాయం రాగా.. గత ఏడాది రూ 4.08 కోట్లు వచ్చింది. లడ్డూ ప్రసాదాలు ద్వారా రూ. 2.48 కోట్లు, దర్శనం టికెట్ల ద్వారా రూ. 2.50 కోట్లు, టికెట్ల ద్వారా రూ.1.03 కోట్లు, తలనీలాల ద్వారా రూ. 20 లక్షలు వచ్చింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కిస్తారు. దసరా ఉత్సవాల్లో సుమారు 12 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
Durga Temple : దసరా ఉత్సవాల్లో దుర్గగుడికి భారీగా ఆదాయం

Durga Temple