విజయవాడ ఇద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఏఈవోగా పని చేస్తున్న వెంకటరెడ్డిని ఆలయ ఈవో భ్రమరాంభ సస్పెండ్ చేశారు. ఇటీవల విజయవాడ ఇందీరాగాంధీ స్టేడియంలో దేవాదాయ శాఖ నిర్వహించిన శ్రీలక్ష్మీ మహాయజ్క్షంలో వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు ఆలయ ఈవో గుర్తించారు. దుర్గగుడి ఈవో భ్రమరాంభ లెటర్ హెడ్ పై అనధికారికంగా వెంకటరెడ్డి సంతంకం చేసినట్లు గుర్తించారు. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కాంట్రాక్టర్ రవికి ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్‌ను ఏఈవో వెంకటరెడ్డి ఇచ్చారు. మహా యజ్ఞం ముగింపు రోజున 20 వేల మందికి భోజనాలు కోసం దేవాదాయశాఖ టెండర్స్ పిలిచింది.ఏఈవో రెడ్డి సర్టిఫికెట్ తో మహా యజ్ఞంలో చివరి రోజు బోజనాలు కాంట్రాక్ట్ రవి దక్కించుకున్నారు.ఈవో లెటర్ హెడ్ దుర్వినియోగం చేసి సర్టిఫికేట్ ఇచ్చినందుకు ఏఈవో వెంకటరెడ్డిన సస్పెండ్ చేశారు.
Indrakeeladri : దుర్గగుడి ఏఈవో వెంకటరెడ్డి సస్పెండ్.. శీలక్ష్మీ మహాయజ్క్షంలో ..?

Durga Temple