Site icon HashtagU Telugu

Climate: తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు

cold wave

cold wave

తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పరిమితమవడంతో చలి తీవ్రత భారీగా పెరిగింది. విశాఖ ఏజెన్సీలో రెండేళ్ల తర్వాత కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పాడేరు, అరకులో 9 డిగ్రీలు, మినుములూరులో 8 డిగ్రీలు, చింతపల్లిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. లంబసింగిలో జీరో డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 8.8 డిగ్రీలు, బేల, అర్లీటీలో 5.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో 6.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 27వరకు తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.