గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దూద్‌సాగర్ జలపాతం వద్ద పెనుప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా దూద్‌సాగర్ జలపాతం వద్ద ఉన్న కేబుల్ వంతెన కూలిపోయింది. దీంతో 40మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోగా.. సహాయక సిబ్బంది చాకచక్యంగా వారిని కాపాడారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వర్షాల కారణంగా దూద్‌సాగర్ జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.