Duddilla Sridhar Babu : మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇవ్వడంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, ఆయనకు చీఫ్ విప్ పదవి ఎలా ఇవ్వగలిగారని ప్రశ్నించారు. ఇది స్పష్టంగా రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను అణిచివేస్తోందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నియామకం నైతికంగా సరైంది కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది పెద్ద ముప్పు అని ఆయన హితవు పలికారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు ధీటుగా స్పందిస్తూ, మహేందర్ రెడ్డి చీఫ్ విప్ నియామకం పూర్తిగా రాజ్యాంగబద్ధంగానే జరిగిందని, శాసనమండలి చైర్మన్ మరియు అసెంబ్లీ స్పీకర్ తమ నిర్ణయాలు ప్రతి కోణంలో విశ్లేషించిన తర్వాతే తీసుకున్నారని వివరించారు. ఏ విధమైన రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. హరీశ్ రావు ప్రతి అంశాన్ని రాజకీయ ప్రాతిపదికన వివాదాస్పదం చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఇది తగదని ఆయన అన్నారు.
WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే మరో స్టన్నింగ్ ఫీచర్!
శ్రీధర్ బాబు ఇంకా హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు చేస్తూ, గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు హరీశ్ రావు శాసనసభా వ్యవహారాల మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. అప్పుడు జరిగిన పరిణామాలను ఆయన మర్చిపోయారా? అప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టు ఎందుకు అనిపించలేదని ప్రశ్నించారు. “తాము చేసిన తప్పులు ఇప్పుడు వేరే పార్టీలపై ఎత్తి చూపడం తగదు” అంటూ హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చారు. అంతేకాక, అరెకపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని సమర్థిస్తూ, ఆ పదవి ఇచ్చే విషయంలో అన్ని నిబంధనలు పాటించామని, విపక్ష సభ్యుడికి ఈ పదవి ఇవ్వడం సంప్రదాయం ప్రకారం జరిగిందని శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
Weight Loss: భోజనం మానేస్తే బరువు తగ్గుతారా.. ఈ విషయాలు అసలు నమ్మకండి!