Site icon HashtagU Telugu

Viral Video: మారథాన్ రేసులో బాతు .. మెడల్ కైవసం!!

Duck marathon

Duck marathon

“కాదేదీ మారథాన్ కు అనర్హం” అని నిరూపిస్తోంది ఒక బాతు. దాని పేరు రింకిల్ (Wrinkle). ఆదివారం అమెరికాలోని న్యూయార్క్ పరిధిలో ఉన్న లాంగ్ ఐలాండ్ లో జరిగిన మారథాన్‌లో ఇది ప్రత్యేక అతిథిగా పాల్గొంది. కాళ్లకు ఎర్రటి షూస్ ధరించి..వందలాది మందితో కలిసి తనకు కేటాయించిన ప్రత్యేక రూట్‌లో రయ్ రయ్ అంటూ పరుగులు పెట్టింది.

క్లైమాక్స్ లో మిగతా వాళ్లలా పరుగులో వేగం పెంచి దూసుకెళ్లింది. రెక్కలు ఊపుతూ వేగంగా పరుగులు తీసి.. “నేనూ వస్తున్నా కాచుకోండి” అనే సందేశాన్ని ఇచ్చింది. ఈవిధంగా క్రీడా స్ఫూర్తి ని పంచిన బాతు రింకిల్ ను మారథాన్ నిర్వాహకులు ప్రశంసించారు. దానికి ఒక స్పెషల్ మెడల్ ను బహుకరించి సత్కరించారు. ఆ బాతు మారథాన్ పరుగుల వీడియో ఒకటి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.

మీరు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో seducctive అనే పేజీలో దీన్ని చూడొచ్చు. మే 2న ఈ వీడియో ను పోస్ట్ చెయ్యగా… ఇప్పటి వరకూ లక్షల మంది చూశారు. 35వేల మందికి పైగా లైక్ కొట్టారు. కాగా, ఇదే బాతు 2021 నవంబర్‌లో న్యూయార్క్ మారథాన్‌లో తొలిసారి పాల్గొంది. అప్పట్లో అది చర్చనీయాంశంగా మారింది. ఈ బాతుకు ఇన్‌స్టా పేజీలో 5.67 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఈ మగబాతును న్యూయార్క్ లోని ఓ ఫ్యామిలీ పెంచుకుంటోంది.

https://twitter.com/Thund3rB0lt/status/1522090092277366784

Exit mobile version