Site icon HashtagU Telugu

Spicejet emergency landing: పాకిస్థాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన భారత విమానం.. కారణం ఇదే!

Flight Emergency Landing

Flight Emergency Landing

సాధారణంగా ఎప్పుడన్నా విమానంలో ప్రయాణం చేసే సమయంలో కొన్ని ప్రమాదాలు జరిగే సమయంలో అత్యవసరంగా విమానాలను లాండింగ్ చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ప్రమాదమున్న సమయంలో విమానం ల్యాండ్ చేసేలోపే ఊహించిన విధంగా జరగాల్సిన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే తాజాగా దుబాయ్ నుంచి ఢిల్లీ పెళ్లెందుకు బయలుదేరిన ఒక స్పైస్ జెట్ విమానం అత్యవసరంగా పాకిస్తాన్లోని కరాచీలో ల్యాండ్ అయింది. అయితే ఇందులో ఉన్న ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. స్పైస్ జెట్ కు చెందిన ఎస్ జి 11 విమానం తాజాగా మంగళవారం ఢిల్లీ నుంచి దుబాయ్ కి బయలుదేరింది.

అయితే ఫ్యూయల్ ఇండికేటర్ లైట్ సక్రమంగా పనిచేయకపోవడంతో పాకిస్తాన్ లోని కరాచీకి దారి మళ్లించినట్టు తెలుస్తోంది. అయితే ఫ్యూయల్ ఇండికేటర్ పనిచేయడం లేదని గుర్తించిన పైలెట్లు వెంటనే ముందు జాగ్రత్తతో విమానాన్ని ల్యాండ్ చేయాలని భావించారు. దీనితో సమీపంలో గల కరాచీ ఎయిర్పోర్టును ఏటీసీని సంప్రదించగా వారు సూచనల మేరకు విమానాన్ని ల్యాండ్ చేశారు. అలా మొత్తానికి విమానం కరాచీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే పైలెట్లు ముందుగానే గమనించి విమానాన్ని ల్యాండ్ చేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని, విమానంలో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

విమానం గాలిలో ప్రయాణించిన 53 నిమిషాల తరువాత కరాచీలో ఉదయం 08:03 నిమిషాలకు ల్యాండ్ అయ్యిందట. ఆ స్పైస్ జెట్ విమానం కరాచీలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు పాకిస్తాన్ పౌర విమానయాన అథారిటీ అధికారి వెల్లడించారు. అయితే ఎటువంటి అత్యవసర పరిస్థితిని ప్రకటించకుండా కరాచీ విమానాశ్రయంలో విమానం సాధారణంగా ల్యాండింగ్ చేయబడింది అని సంస్థ వెల్లడించింది. అయితే విమానంలోని కరాచీ నుంచి దుబాయ్ కి వెళ్లడానికి మరొక విమానాన్ని భారత్ నుంచి పంపించినట్లు స్పైస్ జెట్ ప్రతినిధి చెప్పుకొచ్చారు. అయితే అప్పటివరకు ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడకుండా వారికి అవసరమైన ఏర్పాట్లు చేశామని, విమానంలో అనుకోకుండా సాంకేతిక సమస్య తలెత్తడంతో వారిని కరాచీలు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.