Site icon HashtagU Telugu

DSC : జోరు వానలోనూ డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన

Protest Rain

Protest Rain

డీఎస్సీ పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఆందోళన దిల్‌సుఖ్‌నగర్‌లో ఈ రోజు తెల్లవారు జాము వరకు కొనసాగించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభ్యర్థులు ప్లకార్లు ప్రదర్శిస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ మొండి వైఖరి మాని పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఎక్కువ పోస్టులు పెంచామంటున్నా ప్రభుత్వం, పరీక్ష కోసం ప్రిపేర్ అవడానికి సమయం ఇవ్వకపోతే ఎలా అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. ఇలానే శనివారం సైతం.. కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రూప్‌-2, 3 పరీక్షలను వాయిదా వేయాలని, ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ (డీఎస్‌సీ)ని వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువకులు నిరసనకు దిగడంతో అశోక్‌నగర్‌ ఎక్స్‌ రోడ్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. గ్రూప్-2 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో ఆందోళనకు దిగిన నిరుద్యోగ యువత ప్లకార్డులతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరసన కారణంగా పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయింది , గ్రూప్స్-II , III , DSCలను వెంటనే వాయిదా వేయాలని నినాదాలు చేశారు.

రాష్ట్రంలోని నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నేడు చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని యువత నిర్ణయించింది. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి అమలు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగాల క్యాలెండర్, డీఎస్సీ పరీక్షలను మూడు నెలలు వాయిదా, గ్రూప్-2 వాయిదా వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలన్నది నిరుద్యోగ యువత ప్రధాన డిమాండ్. , III పరీక్షలు, పోస్టుల సంఖ్య పెరుగుదల మొదలైనవి డిమాండ్లతో నిరసనలు తెలుపుతున్నారు.

మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో మరికొన్ని ఖాళీలు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే.. మరో డీఎస్సీను సైతం వేస్తామని ఆయన వెల్లడించారు. దీంతో డీఎస్సీ అభ్యర్థులు నిరసనలు ఉధృతం చేస్తామంటున్నారు.

Read Also : NCC Special Entry : ఎన్‌సీసీ చేసిన వారికి జాబ్స్.. ట్రైనింగ్‌లో ప్రతినెలా రూ.56వేలు