BRS Party: ఎండిన పొలాలు.. అడుగంటిన జలాలు.. వెంటనే గోదావరి జలాలు ఎత్తిపోయాలి

  • Written By:
  • Updated On - March 11, 2024 / 12:15 AM IST

BRS Party: గత పదేళ్ల కాలంలో ఎన్నడూ ఎండని బావులు, బోర్లలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతోనే రైతులు బోరు బావుల్లో పైపులు దించుతున్నారని…. పొలాన్ని ఎలాగైన కాపాడుకోవాలని ఓ రైతు బోరు బావిలో కూలీలను పెట్టి పైపులు దింపిస్తున్న క్రమంలోనే బావుసాయి పేట కు చెందిన పంబాల భూమేష్ కరెంటు కాటుకు బలయ్యాడని…మరో ముగ్గురు బాధితులు పంబల రాజు, కర్ణాల శ్రీను, కర్ణాల మమేష్ లు గాయపడ్డారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు.

కరెంటు షాక్ కు గురై వేములవాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్షించి…సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి మార్చురీలో పంబాల భూమేష్ మృతదేహాన్ని పరిశీలించి..కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో ఎన్నడూ కూడా చెరువులు, కుంటలు ఎండలేదని రైతులకు పుష్కలంగా నీళ్లు ఉండేవని… కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగినాయనే సాకుతో నీళ్లు పంపింగ్ చేయకపోవడంతో భూగర్భజలాలు లేక రైతులు బోర్లలో పైపులు దింపితే నీళ్లు వస్తాయనే ఇలా చేస్తున్నరని అన్నారు. ప్రభుత్వం వెంటనే మేడిగడ్డ బ్యారేజ్ కు మరమ్మతులు చేసి గోదావరి జలాలను ఎత్తిపోయాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం మృతుడు భూమేష్ కుటుంబానికి ₹10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పాటు మానవత దృక్పథంతో మృతుడి భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోర్లలో పైపులు దింపేప్పుడు పైన కరెంటు తీగలు ఉంటే జాగ్రత్తగా దింపాలని సూచన చేశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ వెంట మాజీ పౌరసరఫరాల శాఖ చైర్మన్ రవిందర్ సింగ్, మాజీ జడ్పీ ఛైర్మన్ తుల ఉమ, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సెస్ డైరెక్టర్ తిరుపతి, మార్క్ ఫేడ్ డైరెక్టర్ బండ నర్సయ్య, వేములవాడ. మున్సిఫల్ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, కుమార్, సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, రాజు, మాజీ సర్పంచ్ గంగాధర్, జక్కుల నాగరాజు యాదవ్, దూలం సంపత్, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ రావు, ఎల్లయ్య, తదితరులు ఉన్నారు.