Site icon HashtagU Telugu

70 Years Old Women Rape : రాజ‌స్థాన్‌లో దారుణం.. వృద్ధురాలిపై లైంగిక దాడి..!

crime

crime

రాజ‌స్థాన్‌లోని దౌసా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒక వ్య‌క్తి మ‌ద్యం మ‌త్తులో ప‌క్క ఇంటిలో ఉన్న వృద్ధురాలిపై లైంగిక‌దాడి చేశాడు. శుక్రవారం సాయంత్రం 70 ఏళ్ల వృద్ధురాలు మంచంపై త‌న ఏనిమిదేళ్ల మనవడు తో క‌లిసి నిద్రిస్తుంది. ఆ సమయంలో ఆమె భర్త పశువులను మేపేందుకు బయటకు వెళ్లాడు. ఇంతలో పొరుగున ఉండే 32 ఏళ్ల వ్యక్తి ఆ ఇంట్లోకి వచ్చాడు. మంచంపై పడుకున్న వృద్ధురాలిని బలవంతంగా వంటగదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన భర్త, తన భార్యకు తీవ్ర రక్తస్రావం కావడాన్నిగమనించాడు. వెంటనే ఆమెను బండికూయ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ వృద్ధురాలి ప్రైవేట్‌ భాగంలో గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో జైపూర్‌లో పెద్ద ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Exit mobile version