TTE Urinates: మద్యం మత్తులో రైల్వే టీటీఈ.. మహిళపై మూత్ర విసర్జన!

మహిళ నిద్రిస్తున్న సమయంలో టీటీఈ (TTE) మూత్ర విసర్జన చేశాడని, ఆ తర్వాత ఆమె వెంటనే అలర్ట్ అయ్యింది

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 03 14 At 4.32.41 Pm

Whatsapp Image 2023 03 14 At 4.32.41 Pm

విమానాల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. విమానాల్లో మాదిరిగా రైళ్లలో ఈ తరహా ఘటలు జరుగుతుండటంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమృత్‌సర్, కోల్‌కతా మధ్య నడిచే రైలులో ఓ జంట ప్రయాణిస్తోంది. అయితే మద్యం మత్తులో (TTE) రైలులో మహిళపై మూత్ర విసర్జన (Urinates) చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మార్చి 12 ఆదివారం అర్ధరాత్రి జరిగినట్లు సమాచారం. ఆ టీటీఈని బీహార్‌కు చెందిన మున్నా కుమార్‌గా గుర్తించారు.

మహిళ నిద్రిస్తున్న సమయంలో టీటీఈ (TTE) మూత్ర విసర్జన చేశాడని, ఆ తర్వాత ఆమె వెంటనే మేల్కొని అలారం మోగించింది. ఆమె భర్త టీటీఈ (TTE) ని పట్టుకోవడంతో ఇతర ప్రయాణికులు మేల్కొని పట్టుకొని పోలీసులకు (GRP) అప్పగించారు. అమృత్‌సర్‌లో నివాసం ఉంటున్న ప్రయాణికుడు రాజేష్, అతని భార్య తన భార్య ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు GRP చార్‌బాగ్ రైల్వే స్టేషన్ ఇన్‌చార్జి నవరత్న గౌతమ్ తెలిపారు.

కొన్ని నెలల క్రితం ఎయిరిండియా విమానంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన పక్కనే కూర్చున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఆ తర్వాత అమెరికాలో పనిచేస్తున్న భారతీయుడు శంకర్ మిశ్రాను అదుపులోకి తీసుకుని ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించకుండా నాలుగు నెలల పాటు నిషేధం విధించారు.

Also Read: Anasuya Skin Show: తొడలు చూపిస్తూ.. రెచ్చగొడుతూ, అనసూయ థైస్ పిక్స్ వైరల్!

  Last Updated: 14 Mar 2023, 04:52 PM IST