Peeing On Man : అమానుషం అంటే ఇదే ..
రాక్షస చేష్టలు అంటే ఇవే..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది..
సిధి జిల్లాలోని కుబ్రి గ్రామంలో పాలె కోల్ అనే గిరిజనుడిపై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్ర విసర్జన(Peeing On Man) చేశాడు. తొమ్మిది రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసి జనం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇంకా మానవ హక్కులు ఎక్కడ ఉన్నాయి ? అని ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో 3 రోజుల క్రితం దీనిపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రియాక్ట్ అయ్యారు. నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) ప్రయోగించాలని ఆదేశించారు. ఈమేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
Also read : Cool Drinks : కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే జాగ్రత్త..
కాగా, వీడియోలో గిరిజనుడిపై మూత్ర విసర్జన చేస్తున్న నిందితుడు ప్రవేశ్ శుక్లా బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా ప్రతినిధి అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లాతో ప్రవేశ్ శుక్లా కలిసి దిగిన ఫోటోను కూడా రిలీజ్ చేశాయి. ఆ ఫోటోను ప్రవేశ్ తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడని తెలిపాయి. స్పందించిన బీజేపీ.. ప్రవేశ్ శుక్లాతో తమ పార్టీకి సంబంధం లేదని తేల్చి చేప్పింది. ఆదివాసీలపై జరిగే ప్రతి హేయమైన చర్యను పార్టీ వ్యతిరేకిస్తుందని బీజేపీ నేత ఆశిష్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఇక ప్రవేశ్ శుక్లా తన ప్రతినిధి అనే వాదనలను బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా కూడా ఖండించారు. ఎమ్మెల్యే కేదార్‌నాథ్ శుక్లా ప్రతినిధినని చెప్పుకుంటూ ఫేస్ బుక్ లో ప్రవేశ్ పెట్టిన పోస్టర్ గురించి మీడియా ప్రశ్నించగా.. “సోషల్ మీడియాలో నా పేరును దుర్వినియోగం చేస్తున్నందుకు ప్రవేశ్ శుక్లాపై ఫిర్యాదు చేస్తా” అని ఎమ్మెల్యే వెల్లడించారు.