Site icon HashtagU Telugu

Delhi: మద్యం మత్తులో కలకలం… విమానంలో మూత్రం పోసిన ప్రయాణికుడు!

Whatsapp Image 2023 03 05 At 11.02.42

Whatsapp Image 2023 03 05 At 11.02.42

Delhi: విమానాల్లో కొందరు ప్రయాణికులు వింత చేష్టలు చేస్తున్నారు. తోటి ప్రయాణికులు ఛీకొట్టే పనులు చేస్తున్నారు. ఇటీవల విమానంలో ప్రయాణికులు మద్యం మత్తులో మూత్రవిసర్జన చేసిన ఘటనలు విన్నాం తాజాగా, న్యూయార్క్-ఢిల్లీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మూత్రవిసర్జన చేశాడు. దీంతో ఈ ఘటనను విమానయానశాఖ సీరియస్ గా తీసుకుంది.

ఎక్కడ ఏ పని చేయాలో మనిషికి తెలియటం లేదు. కాసింత సోయ లేకుండా వ్యవహరిస్తున్నాడు. కొందరైతే మరీ తెగిస్తున్నారు. ఓ విద్యార్థి అమెరికాకు చెందిన ఓ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణం చేశాడు. ఈ సందర్భంలో అమెరికా యూనివర్సిటీలో చదువుతోన్న విద్యార్థి.. మద్యం మత్తులో నిద్రపోతూ మూత్రవిసర్జన చేశాడు. అది ఎలాగో లీక్ అయి తోటి ప్రయాణికుడిపై పడటంతో క్యాబిన్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయితే, తాను చేసిన పనికి ఆ విద్యార్థి క్షమాపణ కోరడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. అయితే, దీనిని తీవ్రంగా పరిగణించిన ఎయిర్‌లైన్స్.. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చింది.

ఘటనపై సీఐఎస్ఎఫ్‌తో కలిసి ఎయిర్‌లైన్స్ సొంత భద్రత బృందం చర్యలు చేపట్టింది. విమానం చేరుకున్న వెంటనే నిందితుడ్ని కస్టడీలోకి తీసుకున్నారు. దీనిపై బాధితుల నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. పౌరవిమానయాన నిబంధనల ప్రకారం ఒకవేళ ప్రయాణికుడు అనుచిత ప్రవర్తను రుజువైతే నేర తీవ్రతను బట్టి విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తారు.