Drugs: ప్రియుడి కోసం డ్రగ్స్

ప్రియుడు కోసం ఏమైనా చేసే యువతులను చూసాం. అలాగే ఏకంగా డ్రగ్స్ ను సరఫరా చేసే యువతి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్‌ వాడకం విపరీతంగా పెరిగి పోయింది.

Published By: HashtagU Telugu Desk
drugs

Whatsapp Image 2022 01 31 At 11.05.42 Imresizer

ప్రియుడు కోసం ఏమైనా చేసే యువతులను చూసాం. అలాగే ఏకంగా డ్రగ్స్ ను సరఫరా చేసే యువతి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్‌ వాడకం విపరీతంగా పెరిగి పోయింది. రెండు ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా డ్రగ్స్‌ వాడకాన్ని అరికట్టలేక పోతున్నారు.
విశాఖ నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. లవర్ కోసం మత్తు పదార్ధాలు అక్రమంగా రవాణా చేస్తూ ఓ యువతి అడ్డంగా బుక్కైంది టాబ్లెట్ రూపంలో ఉన్న 18 పిల్స్, 2ఎండీఏంఏలను ఆ యువతి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నుంచి వస్తున్న యువతి దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు టాస్క్ ఫోర్స్ కు పక్కా సమాచారం అందింది.
ఈ నేపథ్యంలోనే మర్రిపాలెం గ్రీన్ గార్డెన్స్ ఏరియాకు చెందిన యువకుడు, హైదరాబాద్ యువతిని అరెస్ట్ చేశారు డ్రగ్స్ అలవాటుపడ్డంతో ప్రియుడి కోసం హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చింది ఆ యువతి. పక్క సమాచారంతో ఉన్న పోలీసులు ఆ యువతి దగ్గర ఉన్న డ్రగ్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆ ప్రేమ జంట పోలీసుల అదుపులో ఉంది. ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  Last Updated: 31 Jan 2022, 06:53 PM IST