Site icon HashtagU Telugu

Drug Peddler: హైదరాబాద్‌లో గంజాయి వ్యాపారి అరెస్ట్.. 30 కిలోలు స్వాధీనం

Drugs Imresizer

Drugs Imresizer

హైదరాబాద్ లో గంజాయి వ్యాపారి పోలీసులు అరెస్ట్ చేశారు.మోటార్‌సైకిల్‌పై 30 కిలోల గంజాయిని తీసుకెళ్తండ‌గా రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్య‌క్తి కామారెడ్డి జిల్లాకు చెందిన జేసీబీ డ్రైవర్ లావుడ్య గణేష్ (28)గా గుర్తించారు.

విశాఖపట్నంలోని చింతూరు ప్రాంతంలో ఒక వ్యక్తి నుంచి కొనుగోలు చేసి యమహా ఎఫ్‌జెడ్ మోటార్‌సైకిల్‌పై కామారెడ్డికి తరలిస్తుండగా నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఓఆర్‌ఆర్ టోల్‌గేట్ వద్ద పట్టుబడ్డాడు. గణేష్ తన మోటారుసైకిల్‌పై గంజాయి తీసుకెళ్తుండ‌గా పోలీసులు అనుమానంతో ఆపి త‌నిఖీ చేసి ప‌ట్టుకున్నామ‌ని ఎస్‌ఓటి ఎల్‌బి నగర్ ఇన్‌స్పెక్టర్ బి అంజి రెడ్డి తెలిపారు.