Site icon HashtagU Telugu

Drones: వాహనదారులపై డ్రోన్ నిఘా, హద్దు మీరితే చలాన్ కట్టాల్సిందే!

Drones

Drones

కొంతమంది సీసీ కెమెరాల ముందు, స్పీడ్ గన్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రం బుద్ధిమంతుల్లా బిల్డప్ ఇచ్చి, మిగతా చోట్ల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తారు. అయితే ఇకపై ఇలాంటి వెసులుబాటు కూడా ఉండదు. నిత్యం డ్రోన్ కెమెరాలు వాహనాల స్పీడ్ ని గమనించేలా కొత్త రూల్స్ వచ్చేశాయి.  బెంగళూరులో ట్రాఫిక్ నిర్వహణకు ఇటీవల డ్రోన్ కెమెరాల వాడకం విజయవంతమైంది. దీంతో వీటి ద్వారా హైవేలపై కూడా వాహనాల స్పీడ్ అంచనా వేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు.

బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌ వేపై ఈ ప్రయోగం మొదలు పెడుతున్నారు. హైవేలపై ఓవర్ స్పీడ్ తో వెళ్లే వాహనాలను ఈ డ్రోన్ కెమెరాలు పసిగడతాయి. ఆ ఫుటేజ్ సాయంతో దగ్గర్లోని టోల్ గేట్ల వద్ద సిబ్బంది అలర్ట్ అవుతారు. ఓవర్ స్పీడ్ వాహనాలకు చలాన్లు విధిస్తారు. కేవలం 9 నెలల కాలంలో 590 ప్రమాదాలు సంభవించగా దాదాపు 158 మంది చనిపోయారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదాలు జరిగాయని పోలీసుల వద్ద పక్కా సమాచారముంది. దీంతో ఈ వేగ నియంత్రణపై పోలీసులు దృష్టిపెడుతున్నారు. డ్రోన్ల నిఘా ఉందని తెలిస్తే వాహనదారులు ఓవర్ స్పీడ్ తో వెళ్లరనేది పోలీసుల ఆలోచన. బెంగళూరు–మైసూరు ఎక్స్‌ ప్రెస్‌ వే, తుమకూరు–చిత్రదుర్గ, ఉడుపి–మంగళూరు, ధార్వాడ–బెళగావి జాతీయ రహదారుల వద్ద తొలి దశలో డ్రోన్లు వినియోగించాలని నిర్ణయించారు.

Exit mobile version