శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయం డ్రోన్ తిరగడం కలకలం రేపుతుంది. శుక్రవారం రాత్రి ఆలయ ప్రధాన గోపురంపై డ్రోన్ కనిపించడంతో ఉద్రిక్తత నెలకొంది. లైటింగ్ ఉన్న డ్రోన్ గోపురం చుట్టూ తిరుగుతున్నట్లు ఆలయ సిబ్బంది గమనించారు, వారు వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. డ్రోన్‌ను కిందకు దించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించినా కుదరలేదు. కాటేజీలపైకి ఎక్కి ఎవరైనా డ్రోన్‌ను నడిపి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కొంత అక్కడే తిరిగిన డ్రోన్ తరువాత వెళ్లిపోయింది.దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Srisailam Temple : శ్రీశైలం ఆలయంలో డ్రోన్ కలకలం

Drones