Drunk n Drive: ఈ పని చేసి వాహనం నడుపుతున్నారా.. అయితే మూడు నెలలు లైసెన్స్ రద్దు?

  • Written By:
  • Updated On - June 9, 2022 / 01:01 PM IST

మద్యం సేవించి రోడ్డుపై వాహనాలు నడపకూడదు అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాహనదారులు వాటిని పెడచెవిన పెడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికిపోయి వేలకు వేలు డబ్బులు కడుతూ ఉంటారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సారి మద్యం సేవించి వాహనం నడిపితే ఈ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందట. వివరాల్లోకి వెళితే.. రోడ్డు భద్రత కోసం సుప్రీం కోర్టు కమిటీ ప్రతిపాదించిన మార్గదర్శకాలను ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలి అని ట్రాఫిక్ పోలీసు అధికారులు నిర్ణయించారు.

ఈ క్రమంలోనే ఇకపై మద్యం తాగి వాహనాలు నడిపిన వారి వివరాలను కోర్టు సమర్పించడమే కాకుండా లైసెన్స్ రద్దు ఉత్తర్వులను రవాణాశాఖకు పంపుతారు. ఆ తర్వాత మూడు నెలల పాటు వారికి డ్రైవింగ్ లైసెన్స్ అర్థమవుతుంది. అయితే ఇంతకు ముందులా కాకుండా ఈసారి కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఒక్కసారి పట్టుబడిన వ్యక్తులు భవిష్యత్తులో మళ్లీ చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. అదేవిధంగా కోర్టులో ప్రతి కేసు నమోదు అవుతుందని జైలుకు వెళ్తే ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు.

అలాగే విదేశాలకు వెళ్లే వీలు కూడా ఉండదని, అలాగె డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినప్పుడు తీవ్రత ఆధారంగా లైసెన్సులు శాశ్వతంగా రద్దు అయ్యే అవకాశం కూడా ఉంది అని తెలిపారు. ఒకవేళ మైనర్లు వాహనాలు నడిపిన తాగి వాహనాలు నడిపిన మోటారు వాహన చట్టం ప్రకారం తల్లిదండ్రులను కూడా జైలుకు పంపించబోతున్నట్లు తెలుస్తోంది.