Uttar Pradesh: తాను చనిపోతూ 40 మంది ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్

రోడ్డు మార్గంలో బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు మార్గమధ్యంలో గుండెపోటు వచ్చింది. ముందు చూపుతూ బస్సును రోడ్డు పక్కన ఆపి కొంతసేపటికి చనిపోయాడు. రోడ్డు సిబ్బందితో పాటు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు మార్గమధ్యంలో గుండెపోటు వచ్చింది. ముందు చూపుతో బస్సును రోడ్డు పక్కన ఆపి కొంతసేపటికి చనిపోయాడు. రోడ్డు సిబ్బందితో పాటు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కన్నౌజ్ డిపో నుండి బయలుదేరే సమయంలో డ్రైవర్ పూర్తిగా క్షేమంగా ఉన్నాడని ఆపరేటర్ చెప్పారు. దారిలో అకస్మాత్తుగా ఇలా జరిగిందని పేర్కొన్నాడు.

కన్నౌజ్‌లోని సికందర్‌పూర్ కరణ్‌లో నివాసం ఉంటున్న మాన్‌సింగ్ కన్నౌజ్ డిపోలో బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం బస్సులో హర్దోయ్‌కు బయలుదేరాడు. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. కండక్టర్ సురేంద్ర సింగ్ ప్రకారం చెప్పిన వివరాల ప్రకారం మాన్‌సింగ్‌కు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో బస్సు హర్దోయ్ బిల్‌గ్రామ్ రోడ్‌లోని సెమ్రా కూడలికి చేరుకుంది. తీవ్రమైన నొప్పి రావడంతో బస్సును రోడ్డు పక్కన ఆపాడని అన్నాడు.

బస్సు దిగి కూర్చున్నాడు. వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. బస్సులో మరో డ్రైవర్‌ కూడా ప్రయాణిస్తున్నాడు. అతని సహాయంతో, బస్సును వైద్య కళాశాలకు తీసుకువెళ్ళాడు, కాని మార్గమధ్యంలోనే మాన్సింగ్ మరణించాడు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

Also Read: Maldives: మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం