దేశస్వాతంత్ర్య సాధనలో ఆశువులు బాసిన జాతిపిత మహాత్మగాంధీ త్యాగాలు నేటి యువతకు స్పూర్తిదాయకమని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. మహాత్మ గాంధీ 154 వ జయంతి,లాల్ బహదూర్ శాస్త్రి 119వ జయంతి వేడుకలు బిఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.తొలుత చంద్రశేఖర్ గాంధీ చిత్ర పటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా సిద్దించిన స్వాతంత్ర్యంతో ద్వారా నేడు మనమందరం స్వేచ్చా వాయువులు పీలుస్తున్నామన్నారు .
స్వాతంత్ర్యం సిద్దించి 76 ఏళ్ళు గడుస్తున్నా నిమ్న వర్గాలకు వాటి ఫలాలు నేటికీ దక్కకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్,భాజపా ప్రభుత్వాలు ఏళ్ల తరబడి దేశాన్ని పాలించినా ప్రజల జీవితాల్లో వెలుగులు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఈ రెండు పార్టీలకు ప్రత్యమ్న్యయం బిఆర్ఎస్ మాత్రమేనన్నారు. రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలంటే దేశంలో బిఆర్ఎస్ అధికార పగ్గాలు చేపడితేనే సాధ్యమౌతోందని స్పష్టం చేశారు. ఎపిలో పాలన గాలికొదిలేసిన వైకాపా ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.ఈ రెండు పార్టీలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పి వక్కాణించారు . టిడిపి,వైసీపీలు ప్రజల్ని నమ్మించి మోసం చేయడంలో పోటీపడుతూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని తూర్పారబట్టారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు తెలంగాణ మాడల్ అభివృద్దిని కాంక్షిస్తూ బిఆర్ఎస్ నాయకత్వం వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు.జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి స్పూర్తి తో ఏర్పడ్డ బిఆర్ఎస్ పార్టీ రైతాంగానికి పెద్ద పీట వేస్తోందని స్పష్టం చేశారు. కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణలో అమలౌతున్న అనేక సంక్షేమ పధకాలు పట్ల ఆకర్షితులై ఎపి బిఆర్ఎస్ లో పెద్దఎత్తున చేరికలుంటున్నాయన్నారు. గుంటూరు లోని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో పలువురు నేతలు జాతిపితకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు మెండా కిరణ్ కుమార్ , నారా తిరుమల నాయుడు, ఎపి నాయుడు, డి.సైదావలి,షేక్ ఖాజావలి,చల్లా రత్న రాజు ,షేక్ భాషా,ఫయాజ్ బాషా, గిద్దా శ్రీనివాస్ నాయుడు,హుస్సేన్ ,మన్సూర్ మీర్జా,ఎల్ .భాస్కర్ ,షేక్ సిరాజ్,షేక్ షాకీర్,నార్నే శేఖర్ తదితరులు పాల్గొన్నారు.