Site icon HashtagU Telugu

Telangana: డాక్టర్ ఎమ్మెల్యేనే ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించండి

Doctors

Doctors

Telangana: ఇటీవల జరిగిన ఎన్నికల్లో 15 నియోజకవర్గాల్లో డాక్టర్లు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇందులో కొంత మంది ఎంబీబీఎస్‌ డాక్టర్లు ఉండగా, కొంత మంది స్పెషలిస్టులు ఉన్నారు. వీరిలో పది మంది తొలిసారి చట్టసభల్లో అడుగు పెట్టబోతుండగా, ఐదుగురికి ఇదివరకే ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉంది. చెన్నూరు నుంచి డాక్టర్ వివేక్‌ వెంకటస్వామి(ఎంబీబీఎస్‌), డాక్టర్ వంశీకృష్ణ(జనరల్ సర్జన్), మహబూబాబాద్ నుంచి డాక్టర్ మురళీనాయక్, మానకొండూరు నుంచి డాక్టర్ సత్యనారాయణ, మెదక్ నుంచి డాక్టర్ మైనంపల్లి రోహిత్, నారాయణపేట నుంచి డాక్టర్ పర్ణికారెడ్డి, నారాయణఖేడ్ నుంచి డాక్టర్ సంజీవ రెడ్డి సహా 15 మంది వైద్యులు ఎంపికయ్యారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసొసియేషన్ సరికొత్త డిమాండ్ చేసింది. వైద్యులకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై సవివరమైన అవగాహన ఉన్నవారిని నియమించాలని కోరింది. వైద్య వృత్తి సంక్లిష్టతలపై వారికి స్పష్టమైన అవగాహన ఉంటుందని, అలాంటివారిని నియమించడం వల్ల మా పని బాధ్యతగా, తేలికగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కొత్త క్యాబినెట్ లో ఆరోగ్య మంత్రిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తారు? అనేదానిపై ఆసక్తి నెలకొంది.