Site icon HashtagU Telugu

Amarnath Yatra 2023: అమర్ నాథ్ యాత్రికులకు ఆ ఫుడ్ బ్యాన్.. అదేంటో తెలుసా?

Amarnath Yatra 2023

Amarnath Yatra 2023

సాధారణంగా కొన్ని టూరిజం ప్రాంతాలలో కొన్ని రకాల వస్తువులను కొన్ని రకాల ఆహార పదార్థాలను బ్యాన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అక్కడి రూల్స్ కి విరుద్ధంగా ప్రవర్తించిన అటువంటి ఆహారాలు వస్తువులు తీసుకెళ్లిన జరిమానాన్ని విధిస్తూ ఉంటారు. అలా తాజాగా కూడా అమర్ నాథ్ లో కొన్ని రకాల ఆహార పదార్థాలను బ్యాన్ చేశారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందువులు అత్యంత పరమపవితంగా భావించే అమర్ నాథ్ గురించి మనందరికీ తెలిసిందే. అమర్ నాథ్ కి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నందమూరి నుంచి పెద్ద ఎత్తున పర్యటకులు వస్తూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే మరొక నెల రోజుల్లో అమర్ నాథ్ యాత్ర ప్రారంభమవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. 2023 జులాయి 1 నుంచి ఆగస్టు 31,2023 వరకు కొనసాగనుంది. ఈ యాత్ర దాదాపు 62 రోజులపాటు కొనసాగనుంది. జమ్మూ కాశ్మీర్ హిమాలయాల్లో పరమేశ్వరుడి మంచు లింగం దర్శనం కోసం కాలినడకన దాదాపు 14 కిలోమీటర్లు సవాలతో కూడిన యాత్రను కొనసాగించాల్సి ఉంటుంది. అక్కడికి వచ్చి యాత్రికులు 14 వేల అడుగుల ఎత్తుకు చేరుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా యాత్రికులు అనేక రకాల ఆ ఆరోగ్య సవాలను ఎదురుకోవాలి.

ఈ నేపథ్యంలోనే అమర్నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు యాత్రికుల కోసం ఆరోగ్య సలహాలు జారీ చేసింది. మరి ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను బ్యాన్ చేసింది. కాగా ఆ పదార్థాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. అన్ని మాంసాహార ఆహారాలు, హెవీ పలావ్,ఫ్రైడ్ రైస్, దోస, పూరి, బతూరే,పరాటా, కూరగాయలు పచ్చళ్ళు, ఫ్రైడ్ పాపడ్, పిజ్జాలు,బర్గర్లు, క్రీమ్స్ తో తయారు చేసే ఫుడ్డు, ఫాస్ట్ ఫుడ్స్, హల్వాలు,జిలేబి, గులాబ్ జామ్, లడ్డు కోయ బర్ఫీ,రసగుల్లా, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్,పొగాకు, గుట్కా,పాన్ మసాలా, పకోరా సమోసా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇలా ఎన్నో రకాల ఆహార పదార్థాలను బ్యాన్ చేసింది.