Monkeypox: మంకీ పాక్స్ రాకూడదంటే ఏం చెయ్యాలి.. ఏం చెయ్యకూడదు.. కేంద్ర సూచనలీవే!

ప్రస్తుతం మంకీ పాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కలవరపెడుతోంది. మెల్ల మెల్లగా చాప కింద నీరులా విస్తరిస్తూ

  • Written By:
  • Publish Date - August 4, 2022 / 05:45 AM IST

ప్రస్తుతం మంకీ పాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కలవరపెడుతోంది. మెల్ల మెల్లగా చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే పదుల సంఖ్యలో మంకీ ప్యాక్స్ వైరస్ సోకి ప్రజలు ఆస్పత్రిల పాలవుతున్నారు. కాగా ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మంకీ పాక్స్ వైరస్ సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయంపై పలు సూచనలు చేసింది. మంకీ పాక్స్ సోకకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇటువంటి పనులు చేయకూడదు? మంకీ పాక్స్ సోకిన వారికి సమీకంగా ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయంపై పలు సూచనలు చేసింది.

ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. మంకీ పాక్స్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి అంటూ ఒక పోస్టర్ ని పోస్ట్ చేసింది. ఈ మంకీ పాక్స్ వైరస్ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరికైనా సోకే అవకాశం ఉందని, మంకీ పాక్స్ సోకిన వారితో ఎక్కువసేపు సన్నిహితంగా గడిపిన, తరచుగా వారిని కలుస్తున్న కూడా ఈ వైరస్ సోకే కే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. మరి ఈ మంకీ పాక్స్ సోకకుండా ఉండాలి అంటే.. మంకీ పాక్స్ సోకిన వారిని వారితో సన్నిహితంగా ఉన్న వారిని ఐసోలేషన్ లో ఉంచాలి. అదేవిధంగా తరచుగా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. వీలైతే శానిటైజర్లు కూడా ఉపయోగించుకోవాలి.

20220803fr62ea40228fa1c

మంకీ పాక్స్ సోకిన వారికి సమీపంలో ఉండాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ చేతులకు గ్లవ్స్ ధరించాలి. ఇక ఏం చేయకూడదు అన్న విషయానికి వస్తే.. మంకీ పార్క్స్ చూపిన వారితో వస్త్రాలు,టవళ్లు, బెడ్ షీట్లు షేర్ చేసుకోవడం వంటివి చేయకూడదు. ఆ వైరస్ సోకిన వారి సంబంధిత వస్తువులతో ఇతరులను వస్త్రలను కలిపి ఉంచకూడదు. మంకీ పాక్స్ వైరస్, లక్షణాలు సోకిన వారి విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదు. ఒకవేళ మంకీ పాక్స్ సంబంధిత లక్షణాలు కనిపించినట్లయితే బహిరంగ ప్రదేశాలకు, జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు.