Koppula: వీకెండ్ లో వచ్చి పొయే కాంగ్రెస్, బిజెపిలకు ఓటు వేయొద్దు : కొప్పుల

  • Written By:
  • Publish Date - May 10, 2024 / 01:46 PM IST

Koppula: పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా RG -2, OC – 3 ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. సింగరేణి కార్మికుల ను రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ‘‘26 సంవత్సరాలు సింగరేణి కార్మికునిగా, కార్మిక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తినీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కెసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగరేణి కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపారు. ముఖ్యంగా డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ అనేది ఆనాడు ఉన్న యూనియన్లు తీసేయగా, కెసిఆర్కృషితో ఈ ఉద్యోగాలను తిరిగి తీసుకురావడం ద్వారా 15 వేల మంది సింగరేణి కార్మికులకు మేలు జరిగింది’’ అని అన్నారు.

‘‘కార్మికుల ఐటి సమస్యలు కావచ్చు. కాంటాక్ట్ వర్కర్ల సమస్యలపై రానున్న ఎన్నికల్లో గెలిస్తే పోరాడే వ్యక్తినీ, అందుకే కారు గుర్తుకు ఓటు వేయాలి. అబద్ధపు ప్రచారాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ వైఖరి ప్రజలు, సింగరేణి కార్మికులకు అర్దం అయింది. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడే ఒకే పార్టీ బీఆర్ఎస్. వీకెండ్ లో వచ్చి పొయే కాంగ్రెస్, బిజెపి కి ఓటు వేయొద్దు’’ అని కొప్పుల ఈశ్వర్ అన్నారు.