Site icon HashtagU Telugu

Errabelli: కాంగ్రెస్ పార్టీని మరోసారి నమ్మొద్దు : మాజీ మంత్రి ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao Signa

Errabelli Dayakar Rao Signa

Errabelli:  అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పెద్దపెద్ద వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టింది’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ ఎస్ వరంగల్ లోక్ సభ అభ్యర్థి ఎం.సుధీర్ కుమార్ కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.ప్రజల భవిష్యత్ లో మార్పు తీసుకొస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏమీ చేయకుండా చేతులెత్తేసిందన్నారు.

విద్యుత్ అంతరాయాలు మళ్లీ సాగు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న రైతుల కష్టాలను మరింత పెంచుతున్నాయని ఎర్రబెల్లి అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులకు నగదు ప్రయోజనంతో పాటు ఒక తులాల బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి ఆ పని చేయలేదన్నారు. కాంగ్రెస్ ను మరోసారి నమ్మొద్దని, ఆ పార్టీని ఆదరించినట్లేనని ఆయన ప్రజలను కోరారు. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఎర్రబెల్లి చెప్పారు. ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కూడా ప్రచారంలో పాల్గొన్నారు.