Site icon HashtagU Telugu

Serilingampally: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దు: శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్

Jagadeeshwar Goud

Jagadeeshwar Goud

Jagadeeshwar Goud: శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు కొద్ది సమయమే ఉండటంతో ఆయన పలు కార్పొరేషన్ ఏరియాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆయన ప్రచారానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వస్తోంది. ముఖ్యంగా అన్ని వర్గాల వారు జగదీశ్వర్ గౌడ్ కు మద్దతు తెలుపుతూ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తుండటం ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార సభలో జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల పేరుతో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సాధ్యంకానీ హామీలు ఇస్తున్నాయని, ప్రజలు వాటిని నమ్మ మోసపోవద్దని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటుందని, గెలిచే పార్టీకే ఓటు వేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ వస్తే పిల్లలకు మంచి విద్య, స్కాలర్ షిప్, మహిళలకు తక్కువ ధరకే సిలిండర్లు ఇస్తుందని ఆయన అన్నారు. తమ పార్టీ మ్యానిఫెస్టో కూాడా అద్భుతంగా ఉందనీ, తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన అన్నారు.

Also Read: Rudraksha: రుద్రాక్ష ధరించడం వల్లే కలిగే ఉపయోగాలు ఇవే