Site icon HashtagU Telugu

Sajjanar : ఇలాంటి కంపెనీలను ప్రమోట్ చేయకండి… సానియా మీర్జాకు సజ్జనార్ ట్వీట్..!

Don't Promote These Types Of Companies... Sajjanar Tweet To Sania Mirza..!

Don't Promote These Types Of Companies... Sajjanar Tweet To Sania Mirza..!

Sajjanar : TSRTC ఎండీ, IPS ఆఫీసర్ V.C. సజ్జనార్, ఆర్థిక మోసాలకు పాల్పడే మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలను సెలబ్రిటీలు ప్రమోట్ చేయకూడదని సూచించారు. క్యూనెట్ (QNET) లాంటి కంపెనీల యాడ్‌లలో నటించి అలాంటి సంస్థలను ఎంకరేజ్ చేయవద్దని కోరారు. భారత టెన్నిస్ మాజీ క్రీడాకారిణి సానియా మీర్జాపై తాజాగా వచ్చిన ఓ వార్తా కథనాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో జోడిస్తూ ట్వీట్ చేశారు. క్యూనెట్ వంటి మల్టీలెవల్ సంస్థల వల్ల సామాన్య ప్రజలు భారీ మొత్తంలో డబ్బును కోల్పోయారని ఇటువంటి సంస్థలను ప్రమోట్ చేయవద్దని సజ్జనార్ వెల్లడించారు.

దేశ ఆర్థిక వ్యవస్థను, సామాజిక వ్యవస్థను నాశనం చేసే ఆమ్ వే వంటి కంపెనీలకు అంబాసిడర్లుగా ఉండొద్దని అమితాబచ్చన్‌కు సజ్జనార్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో తాజా మరోసారి ఆయన ట్విట్టర్ వేదికాగా సెలబ్రెటీలు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని అమితాబ్ బచ్చన్, సానియా మిర్జాలపై యాష్ ట్యాగ్ ఇస్తూ శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. IPS ఆఫీసర్ V.C. సజ్జనార్ (Sajjanar) వంటి వారు సమాజం ప్రభావితం అవుతుందని అలర్ట్ చేసినా కొంతమంది సెలబ్రిటీలు మాత్రం తప్పుడు ప్రొడక్ట్‌లకు అంబాసిడర్లుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.