Dogs: శునకాలే కాదండోయ్‌… వాటి ప్రేమికులు కరుస్తారట జాగ్రత్త!

శునకాలను చూస్తే జనం బెంబెలెత్తిపోతున్నారు.గతంలో కుక్కకాటుకు గురైన వ్యక్తుల ఘటనలు చూశాం. కానీ తాజాగా తెలంగాణలో జరిగిన శునకాల దాడిపై పెద్ద ఎత్తున

  • Written By:
  • Updated On - February 22, 2023 / 07:58 PM IST

Dogs: శునకాలను చూస్తే జనం బెంబెలెత్తిపోతున్నారు.గతంలో కుక్కకాటుకు గురైన వ్యక్తుల ఘటనలు చూశాం. కానీ తాజాగా తెలంగాణలో జరిగిన శునకాల దాడిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. పెద్దలు, పిల్లలు అని తేడా లేకుండా కుక్కలు దాడికి తెగబడుతున్నాయి. ఇక రాత్రి సమయాల్లో ఇంటికి వచ్చేందుకు జనం భయపడిపోతున్నారు. వీధి కుక్కల పోటు ఏంటి రా అని రోదిస్తున్నారు. స్థానిక అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అయితే కుక్కలపై అమితమైన ప్రేమ ఉన్నావారు బోలేడు మంది. వాటిని తిట్టినా, కొట్టిన కొందరికి అస్సలు గిట్టదు.

వీధికుక్క కు ఆహారం ఇవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళను శునక ప్రేమికురాలు కొరికేసింది. గుజరాత్‌లోని కేటా జిల్లా నదియాత్ తాలూకాలోని కమ్లా గ్రామానికి చెందిన సీతాజల భర్త ఏడాది క్రితం మరణించాడు. దీంతో కుమారులు యగ్నేష్, ప్రకాష్‌తో కలిసి సీతాజల నివసిస్తున్నారు. అయితే ఆదివారం ఈవెనింగ్ ‌సాయంత్రం రావల్ అనే మహిళ వీధి కుక్కకు ఆహారం ఇస్తూ కనిపించింది. వారం రోజుల క్రితం సీత కొడుకు ప్రకాష్‌ని అదే కుక్క కరిచింది. అందుకని రావల్ దగ్గరకు వెళ్లి దానికి ఆహారం ఇవ్వవద్దని సీత వారించారు.

కానీ సీత మాటలు వినిపించుకోలేదు. రావల్‌ కుక్కకు ఆహారం పెడుతూనే ఉన్నారు. మరోసారి సీతా గట్టింగా చెప్పారు. దీంతో రావల్, ఆమె భర్త కమలేష్ కోపంతో కర్ర తీసుకొని సీతపై దాడి చేశారు. అంతేకాదు.. తన చేతులు పట్టుకుని ఆమె ఆపడానికి ప్రయత్నించినప్పుడు, రావల్ తన బొటనవేలును కొరికింది.

ఈ విషయం విన్న సీత పెద్ద కుమారుడు యజ్ఞేష్ తన తల్లిని రక్షించేందుకు పరుగెత్తాడు. రావల్, ఆమె భర్త తనను చంపుతామని
బెదిరించారని యజ్ఞేష్ పోలీసులకు తెలిపారు. అయితే జాలాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించారు. పలుచోట్ల గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వామ్మో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అని సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పెడుతున్నారు.