Site icon HashtagU Telugu

Dog Reunites With Owner: తప్పిపోయిన ఐదేండ్లకు దొరికింది…కంటతడి పెట్టిస్తోన్న వీడియో..!!

Screenshot 2022 04 12 At 1.50.56 Pm Imresizer

Screenshot 2022 04 12 At 1.50.56 Pm Imresizer

పెంపుడు జంతువులు ఎన్ని ఉన్నా…అందులో కుక్కది మాత్రం ప్రత్యేక స్థానం అని చెప్పాలి. అంతేకాదు కుక్కలు విశ్వాసానికి మారుపేరు. తమ యజమాని పట్ల కుక్క చూపించే విశ్వాసం..వారి సంతానం కూడా చూపించది కావచ్చు. అందుకే చాలా మంది కుక్కలను పెంచుకుంటారు. వాటిపై ఎలేని ప్రేమను చూపిస్తుంటారు. కన్నబిడ్డల వలే చూసుకుంటారు. అవి కూడా యజమానులపై ఎనలేని ప్రేమను చూపిస్తుంటాయి. యజమాని బయటకు వెళ్లారంటే…తిరిగి వచ్చే వరకు గుమ్మం వైపు చూస్తుంటుంది.

ఇలాంటి వీడియో ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుక్క యజమాని పట్ల చూపించిన వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తప్పిపోయిన కుక్క…ఐదేండ్ల తర్వాత తన యజమానిని కలిసింది. యజమానిని చూడగానే…ఆ కుక్క చూపించే మమకారం…కన్నీళ్లు తెప్పిస్తుంది. యజమానిపై కుక్కకు ఉన్న ప్రేమ నెటిజన్ల గుండెలను పిండేసింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను లక్షలాది మందికి పైగా వీక్షించారు. లైక్స్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.

Exit mobile version