Real Hero: కళ్లెదుటే గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి.. డాక్టర్ చేసిన పనికి షాక్?

ఒక సామాన్య వ్యక్తి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లాడు. ఇక హాస్పిటల్ లో వైద్యుడికి ఎదురుగా కూర్చుని ఉండగా ఇంతలోనే అతనికి

  • Written By:
  • Publish Date - September 8, 2022 / 05:45 AM IST

ఒక సామాన్య వ్యక్తి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లాడు. ఇక హాస్పిటల్ లో వైద్యుడికి ఎదురుగా కూర్చుని ఉండగా ఇంతలోనే అతనికి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో డాక్టర్ చేసిన పనికి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన అర్జున్‌ అద్నాయక్‌ కార్డియాలజీ నిపుణుడు. గుండె సంబంధిత వ్యాధి ఉన్న ఓ రోగి అర్జున్‌ వద్దకు నిత్యం జనరల్‌ చెకప్‌ కోసం వస్తుండేవారట.

ఇక ఎప్పటిలాగే సాధారణ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వచ్చాడు. అయితే 12ఏళ్ల క్రితం అమర్చిన పేస్‌మేకర్‌ ను ఈసారి భర్తీ చేయించుకోవాలనుకున్నాడు. హాస్పిటల్ క్యాబిన్‌లో వైద్యుడి ముందు సీట్లో కూర్చున్న ఆ రోగికి ఉన్నట్టుండి అప్పుడే గుండెపోటు వచ్చింది. ఫలితంగా ఎలాంటి చలనం లేకుండా కుర్చీలో కిందికి వాలిపోసాగాడు. అతని పరిస్థితిని గమనించిన వైద్యుడు అర్జున్‌ వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కుర్చీలో ఉన్న అతడికి అక్కడే సీపీఆర్‌ చేశాడు. కొద్ది సెకన్లలో ఆ రోగి మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

 

ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గుండెపోటు వచ్చిన రోగిని గమనించిన ఆ వైద్యుడు క్షణం ఆలస్యం చేయకుండా వైద్యుడు వెంటనే స్పందించిన తీరు, సీపీఆర్‌ చేసి రోగిని అపాయం నుంచి బయటపడేసిన వైనం అందరినీ కట్టిపడేసింది. వైద్యుడు అర్జున్‌ని మెచ్చుకుంటూ అనేకమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.