Site icon HashtagU Telugu

Ice Pizza: ఐస్ పిజ్జా వైరల్ వీడియో.. తయారీ పద్ధతి వెరైటీ గురూ!!

Ice Pizza

Ice Pizza

పిజ్జా.. చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఓ కొత్త రకం పిజ్జా తయారీ పద్ధతి వైరల్ అవుతోంది. అదే ఐస్ క్యూబ్ పిజ్జా. “Does He Bake Dough” అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో దీనికి సంబంధించిన వీడియోను ఒక ఔత్సాహిక ఫుడీ పోస్ట్ చేశారు. దీనికి ఇప్పటివరకు 70 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంతోమంది ఆహార ప్రియులు ఈ వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు. ఇతరులకు షేర్ చేస్తున్నారు.

అందువల్ల అంత పెద్దఎత్తున వీడియో వైరల్ అయింది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది.. అనుకుంటున్నారా? సాధారణ పిజ్జా తయారీ పద్ధతికి పూర్తి భిన్నమైన రీతిలో దీన్ని తయారు చేశారు. గోధుమ పిండి ముద్దను రొట్టెలా తయారు చేసి .. అందులోపల నాలుగైదు ఐస్ క్యూబ్ లు జమాయించారు. ఆ తర్వాత దాన్ని బేకింగ్ చేశారు. బేకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఐస్ పిజ్జాలో తురిమిన జున్ను ముక్కలను నింపారు. దీంతో వెరైటీ ఐస్ పిజ్జాగా మారిపోయింది.

మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ఈ పిజ్జాను తయారు చేసి చూడండి. దీని తయారీని చూపించే వీడియోను చూసిన నెటిజన్స్ వివిధ కామెంట్స్ చేశారు. “ఒకసారి ఆ రెసైపీని మాకు షేర్ చేయండి” అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.”ఎందుకు.. మనుషులు సాధారణంగా ఉండలేరు.. అసాధారణ ఆలోచనలు ఎందుకు వస్తాయి” అని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు.

 

Exit mobile version