TS Govt: ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

  • Written By:
  • Updated On - February 1, 2024 / 04:47 PM IST

TS Govt: తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న షబ్‌-ఇ-మెరాజ్‌కు సెలవు ఇచ్చింది. షబ్‌-ఇ-మెరాజ్‌ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హాలీడేస్‌ క్యాలెండర్ ప్రకారం  ఆరోజు అన్ని తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు సెలవ్ ఉంటుంది. ఇది మొదట సాధారణ సెలవు కాకుండా ఐచ్ఛిక సెలవు అని ప్రభుత్వం పేర్కొంది. కానీ.. తాజాగా సాధారణ సెలవుగా మార్చింది. కాగా.. షబ్-ఇ-మెరాజ్ ను ముస్లిములు పవిత్రమైన రోజుగా భావిస్తారు.  షబ్-ఇ-మెరాజ్ రోజు సందర్భంగా ముస్లింలు మసీద్ లను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు.

ఫిబ్రవరి 8న సాధారణ సెలవు అని ప్రభుత్వం తాజాగా ప్రకటించడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూతపడనున్నాయి. ఇక ఈ సెలవు తర్వాత ఫిబ్రవరిలో సాధారణ సెలవులు లేవు. సాధారణ పండుగలు జనవరి తర్వాత మార్చిలోనే ఉంటాయి. షబ్-ఎ-మేరాజ్ (Shab-e-Miraj) ప్రపంచంలోని అన్ని దేశాలలోని ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక పండుగ సందర్భంగా మహమ్మదు ప్రవక్త ఆయన అనుచరులంతా రోజుకు అయిదు సార్లు నమాజ్ చెయ్యాలని ఆదేశిస్తాడట.